నెల్లూరులో మెడికో ఆత్మహత్య..

  • సంతజూటూరు కన్నీరు మున్నీరు

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : తండ్రి సాధారణ రైతు. అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మానాన్న తల్లడిల్లిపోయారు. బాగా చదవాలి… డాక్టరవ్వాలి అనుకుంది. అలాగే పోటాపోటీగా చదివింది. ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఏం జరిగిందో.. ఈ చిట్టి తల్లి డాకరమ్మ కాకుండానే ఆత్మహత్య చేసుకుంది.

ఎందరినో కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు గ్రామస్థుల్ని దుఃఖసాగరంలో ముంచింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

సంత జూటూరు గ్రామానికి చెందిన బన్నెల సంజీవరాయుడు ఓ సాధారణ రైతు. ఆమె భార్య లక్ష్మీదేవి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రెండేళ్ల కిందట కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. రెండవ కుమార్తె గీతాంజలి మనోస్థైర్యంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించింది.

ఇక కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇక గీతాంజలి నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది. తల్లిదండ్రుల ఆనందానికి అవధి లేదు. అంతలోనే అమ్మానాన్న ఆనందం ఆవిరైపోయింది.

దసరా పండగకి గీతాంజలి ఇంటికి వచ్చింది. కానీ ఏమి జరిగిందో.. అకస్మాత్తుగా ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి, ప్రిపేర్ కావాలని నెల్లూరుకు వెళ్ళింది. శుక్రవారం ఉదయం తన సన్నిహితులతో జోష్ గానే మాట్లాడింది. టిఫిన్ చేసింది. మరో అరగంటలో తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసేపుకుంది.

ఈ దృశ్చం చూసిన విద్యార్థినులు హాస్టల్లో గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చారు. నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దరు కుమార్తెలూ అర్ధరంతరంగా బల్వన్మరణం చెందటంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.

గీతాంజలి మనో దైర్యశీలి. చిన్నప్పటి నుంచి శ్రమించే మనస్తత్వం. ఎవ్వరతోనూ వివాదాల జోలికి వెళ్ళేది కాదు, అని బంధువులు చెబుతున్నారు. అక్కడ ఏమైంది అనేది ఎవరికి తెలియటం లేదు. తల్లిదండ్రులు బంధువులు హుటా హుటిన నెల్లూరుకి వెళ్లారు.

Leave a Reply