Medaram |ముగింపు ద‌శ‌కు మేడారం జాత‌ర

Medaram |ముగింపు ద‌శ‌కు మేడారం జాత‌ర

Medaram |వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మేడారం మ‌హాజాత‌ర ముగింపు ద‌శ‌కు చేరుకుంది. సమ్మక్క సారలమ్మ జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ తల్లుల వనప్రవేశంతో వన జాతర ముగియనుంది. సాయంత్రం సమయంలో గద్దెలను పరిశుభ్రం చేసి, గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలను నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో దేవతల వన ప్రవేశం కార్యక్రమం ఆరంభమవుతుంది. సమ్మక్క తల్లిని చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను ఏటూరినాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకువెళ్తారు.

ఇంకా త‌గ్గ‌ని ర‌ద్దీ..
దేవతల వనప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. మేడారం ఇంకా భక్తులతో కిటికిటలాడుతోంది. మహా జాతర ముగుస్తున్న తరుణంలో లక్షలాదిగా మంది భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలను ఆచరించి వన దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు చీర, ఒడిబియ్యం, సారె, పోసి దేవతలను మనసారా కొలుచుకున్నారు.

Leave a Reply