Medak | ఆదర్శ గ్రామంగా మారుస్తా..

Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క అవకాశమిస్తే.. గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మెదక్ మండలం బాలానగర్ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బెండ వీణ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం గ్రామంలోని ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి బ్యాట్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఓట్లేసి గెలిపిస్తే.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు.

Leave a Reply