TG | రేపు మాంసం విక్రయాలు బంద్.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రేపు నాన్ వెజ్ షాపులను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాతిపిత వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మేకలు, గొర్రెల మండీలు, దుకాణాలను మూసివేయాలి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. గాంధీ అహింసా మార్గాన్ని అందరూ పాటించాలని… హింసాత్మక చర్యలు చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు. మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ అహింసా మార్గాన్ని అనుసరించమని సందేశాన్ని వ్యాప్తి చేశారు.