ముంపు బాధితుల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు

ముంపు బాధితుల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని మర్లపాడు తండా ముంపు ప్రాంతాలు ఎస్‌.ఎల్‌.బి.సి వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) రేపు అచ్చంపేట మండలానికి రానున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కార్యాలయం నుండి ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1:00 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ఎస్ ఎల్ బీసీ వద్దకు చేరుకొని, మర్లపాడు తండా ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం(review meeting) నిర్వహించి, ముందు బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వనున్నట్లు ఆ ప్రకటన ద్వారా తెలిపారు.

Leave a Reply