జాగృతి జనం బాటకు ఆశీస్సులు ఉండాలి

జాగృతి జనం బాటకు ఆశీస్సులు ఉండాలి

తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

తిరుమల ఆంధ్రప్రభ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆదివారం వేకువ జామున బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం సంతోషంగా ఉందనారు.
ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని సంకల్పించానని, నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నామన్నారు.

Leave a Reply