Mavullamma | బంగారు కానుక..
Mavullamma, భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) మావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు 20 గ్రాముల బంగారాన్ని విరాళంగా శుక్రవారం అందించారు. మొగల్తూరు మండలం జగన్నాధపురం ఎంపీటీసీ మంతెన పాండు రంగరాజు, సాయి మౌనిక దంపతులు వారి కుటుంబ సభ్యులు 20 గ్రాముల బంగారాన్ని భీమవరం (Bhimavaram ఎమ్మెల్యే రామాంజనేయులు (అంజిబాబు) (Ramanjaneyulu ) చేతుల మీదుగా ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మావుళ్ళమ్మ అమ్మవారికి స్వర్ణ వస్త్రానికి దాతలు భక్తులు ఎంతో సహకారం అందిస్తున్నారని, భక్తుల కల త్వరలోనే నెరబోతుందని, త్వరలోనే అమ్మవారి స్వర్ణ వస్త్రం పూర్తి చేస్తామన్నారు. విరాళం అందించిన దాతలను ఎమ్మెల్యే అంజిబాబు (Ramanjaneyulu) అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ, పడమటి రామకృష్ణ, బోండాడ నాగ భూషణం, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కొప్పర్తి నరసింహా మూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

