High School | కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక

High School | కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక

High School | నాగాయలంక, ఆంధ్రప్రభ : మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ తలగడ దీవి విద్యార్థిని కె. మౌనిక (K.Mounika) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయింది. ఈనెల22 నుంచి 24 వరకు మచిలీపట్నం నోబుల్ కళాశాలలో (at Noble College) నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో కృష్ణా జిల్లా తరఫున ప్రాతి నిత్యం వహించిన కే మౌనిక అండర్ 14 విభాగంలో కృష్ణాజిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకుని జనవరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండ్రెడ్డి శివరామ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని (Student) పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వర్రే రాంబాబు, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ మోహన్ లాల్ గారు, సర్పంచ్ భోగాది వెంకటేశ్వరావు, అలాగే శిక్షణ ఇచ్చిన పీడి బిపిఎల్ ప్రసాదును ఎంపికైన విద్యార్థిని కె మౌనికను పాఠశాల విద్యా కుటుంబం కుటుంబం అభినందించారు.

Leave a Reply