Massive fire | కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Massive fire | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 21 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడుతూ భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది.
మృతులను ప్రణీత్, బేబీ, ఇంతియాజ్, అఖిల్, హబీబ్‌గా గుర్తించారు.భవనం లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో, సుమారు 200మంది రెస్క్యూ సిబ్బంది రాత్రంతా నిర్విరామంగా శ్రమించారు. చివరికి సెల్లార్‌లో ఒక గుంత తవ్వి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడ విగతజీవులుగా పడి ఉన్న ఐదుగురిని గుర్తించారు.
