ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు గురువారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పార్టీ కార్యాలయంలో నాయకులు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి అచ్చెన్నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవసాయ రంగ ప్రక్షాళనలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని, పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు, మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్ధనరావు, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, ఘంటసాల రాజమోహనరావు, చందన రంగారావు, డోకీపర్తి బాలకోటేశ్వర రావు, మెగవత్తు గోపి, కొండవీటి మధు, ఉప్పల ప్రసాద్, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, గుంటూరు వినయ్, నాగిడి రాంబాబు, తాడేపల్లి పాపారావు, ముళ్ళపూడి శ్రీనివాసరావు, బచ్చు రాఘవయ్య, కంచర్ల ఆనంద్, కొల్లూరి వాసు, బచ్చు రమణ, మెరుగు సోమిరెడ్డి, రేపల్లె అంకినీడు, మోటుపల్లి పండు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply