Market Committee | 40 షెటర్లు నిర్మిస్తాం..

Market Committee | 40 షెటర్లు నిర్మిస్తాం..
- వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు
Market Committee | వికారాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయంలో పెంచడం కోసం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 45 షట్టర్ల(45 shutters) (దుకాణాలు) నిర్మాణం చేపట్టనున్నట్టు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయాలను పెంచి బలోపేతం చేయడమే ధ్యేయంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచనల మేరకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు.
మార్కెట్ కమిటీ ఆవరణలో 30 షాపులు రైతు బజార్ వద్ద మరో 10 షాపులు నిర్మాణం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి విన్నవించినట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం, గురువారం మధ్యాహ్నం వేళల్లో రైతులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మార్కెట్ కమిటీ(Market Committee)ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా జీరో వ్యాపారాన్ని అరికట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు. రైతు బజార్‌లో రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి మధ్య దళారుల వ్యవస్థను అరి కడతానని ఆయన పేర్కొన్నారు.
