Markapuram | తల్లి మంటల్లో సజీవదహనం..

Markapuram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి కొడుకును కాపాడిన తల్లి, చివరికి మంటల్లో చిక్కుకుని సజీవదహనమైన సంఘటన అందరినీ కలచివేసింది.

కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి (45) తన కుమారుడు మనోహర్‌తో కలిసి బస్సులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన రమాదేవి, వెంటనే తన కొడుకును బయటికి తోసేసి అతని ప్రాణాలు కాపాడింది.

అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో రమాదేవి బస్సులోనే చిక్కుకుంది. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాక, తన కొడుకు కళ్లముందే మంటల్లో సజీవదహనమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి త్యాగం చూసి అక్కడున్నవారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

Leave a Reply