Maoists | 40ఆయుధాల సరెండర్..

Maoists | 40ఆయుధాల సరెండర్..

Maoists | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టులు (42 Maoists) ఆయుధాలతో సహా లొంగిపోవడం (Surrender)

సంచలనంగా మారింది.

తెలంగాణ డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో 11 మంది పీఎల్‌జీఏ బెటాలియన్ సభ్యులు (PLGA Battalion members) ఉండగా, బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. కేశాలు లొంగుబాటును పోలీసులు కీలక పరిణామంగా భావిస్తున్నారు.

లొంగిపోయిన మావోయిస్టులు సుమారు 40 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీరిలో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ‘ఆపరేషన్ ఖగార్’ (Operation Khagar) గడువు ముగిసిన తర్వాత కూంబింగ్ చర్యలు తీవ్రతరం కావడంతో, పలువురు మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందినవారని డీజీపీ వెల్లడించారు. అలాగే లొంగిపోయిన మావోయిస్టులకు మొత్తం రూ.1.93 కోట్లు ప్రోత్సాహకంగా అందజేస్తామని ప్రకటించారు.

Leave a Reply