Maoist | టెక్ శంకర్ హతం

Maoist | టెక్ శంకర్ హతం

  • మారేడుమిల్లిలో మళ్లీ ఎన్ కౌంటర్
  • ఇందులో ముగ్గురు మహిళలు

చింతూరు/మారేడుమిల్లి, ఆంధ్రప్రభ : అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్తో దద్దరింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు (Maoist) మృతిచెందారు. బుధవారం తెల్లవారు జామున గుజ్జుమామిడి వలస అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకోగా ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు.

వీరందరూ దండకారణ్యంలోని చత్తీస్ గడ్ మావోయిస్టులే. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టు పార్టీ ఏవోబీ ఇంఛార్జ్, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు కు చెందిన మెట్టూరి జోగా రావు అలియాస్ టెక్ శంకర్, అలియాస్ శంకర్ బాబు, శివ. ప్రస్తుతం డీసీఎం సభ్యురాలు.

మాజీ మావోయిస్టు చీఫ్‌ నంబాల కేశవ రావు అలియాస్ బీఆర్ దాదా గార్డ్ కమాండర్‌ సుకుమా జిల్లా (కిస్టారం ప్రాంతం) బూర్గులంక ప్రాంతానికి ⁠జ్యోతి అలియాస్ సరిత (32) , రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు, ఏ సిఎం, జగర గొండ ఎల్ ఓ ఎస్ , ఎఎస్ బి టి డీవీసీ, ఎర్రా కమ్యూనికేషన్ టీమ్‌లో పనిచేసిన సురేష్ అలియాస్ రమేష్, ఎస్ బీటీ డీవీసీ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ దాదాకు అంగరక్షకుడు , ఏసీఎం లోకేష్ అలియాస్ గణేష్, ఎఎస్ బి టి డీవీసీ డిప్యూటీ. కమాండర్‌, జాగర్ గొండ లాస్, ఏసీఎం, సైను అలియాస్ వాసు, జగర్ గొండ ఎల్ వోఎస్ , ఎఎస్ బీ టీ డీవీసీ గా పని చేసిన ఏసీఎం అనిత, జగరగొండ ఎల్ వో ఎస్ , ఎఎస్ బి టి డీవీసీ సభ్యురాలు, ఏసీఎం షమ్మీ మృతి చెందారు. ఘటన స్థలిలో రెండు ఏకే 47, మరి కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Maoist | కూంబింగ్ యథాతథం

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. కాగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు.. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్నారు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజినల్ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నట్టు చెప్పారు. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్ కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు.

Maoism End  :    మావోయిజం అంతం

Leave a Reply