60 మందితో లొంగిపోయిన మ‌ల్లోజుల‌

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మావోయిస్టుల కేంద్ర క‌మిటీ స‌భ్యుడు, సెంట్ర‌ల్ మిల‌టరీ కమిటీ స‌భ్యుడు మల్లోజుల వేణుగోపాల రావు (Mallojula Venugopala Rao) అలియాస్ సోను అలియాస్ అభయ్ లొంగిపోయారు. ఈ రోజు గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆయ‌న లొంగిపోయారు. ఇటీవల జరిగిన పరిణామాలతో అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు.

తాను ఎంచుకున్న సిద్ధాంతం కోసం నాలుగు దశాబ్దాల క్రితం పెద్దపల్లి (Peddapally) కి చెందిన మల్లోజుల కోటేశ్వరరావు కన్న వారిని విడిచిపెట్టి తుపాకీ చేత భూనీ అడవి బాట ప‌ట్టారు. మావోయిస్టు పార్టీలో ఏర్పడ్డ విభేదాలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పకడ్బందీ దాడులు నిర్వహిస్తుండడంతో మల్లోజుల లొంగిపోయేందుకు నిర్ణయం తీసుకొని 60 మందితో పాటు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి తో గచ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం గడ్చి రోలి పోలీసులు అధికారికంగా మావోయిస్టుల లొంగుబాటును ప్రకటించనున్నారు.


ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌ : మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్ట్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ అలియాస్ భూపతి పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన‌ మల్లోజుల తలపై రూ.6 కోట్లకు పైగా నజరానా ఉంది. ఇటీవలే కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరుతో ఆయన అభయ్ పేరుతో కరపత్రాలు విడుదల చేయడం సంచలనం రేపింది.


మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటును ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ ఈ రోజు ధ్రువీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని విజయ్ శర్మ పేర్కొన్నారు.

Leave a Reply