Maoist | ముగ్గురు దళ, ఐదు మీలీషియా నెంబర్స్

Maoist | ముగ్గురు దళ, ఐదు మీలీషియా నెంబర్స్

  • ఒక్కొక్కరికి 25వేలు తక్షణ సహాయం అందజేత
  • మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవండి : రామగుండం పోలీస్ కమిషనర్

Maoist | గోదావరిఖని, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. లొంగుబాటు పర్వం రోజురోజు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట తెలంగాణ, చత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్, తెలంగాణ (Telangana) సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించిన ముగ్గరు దళ సభ్యులు, మరో ఐదుగురు మిలీషియా సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యం గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంతోపాటు చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పోడియం కాములు, ముడియం జోగ, కుంజం లక్కే, మోదం భీమ, కుంజం ఉంగా, ముడికం సుక్రం ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తక్షణ పునరావాసం కింద రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఒక్కొక్క మావోయిస్టుకు రూ. 25 వేల సహాయం అందజేశారు.

Maoist

Maoist | లొంగిపోతే పునరావాసం : సీపీ

రామగుండం పోలీస్ కమిషనర్ (Police Commissioner) అంబర్ కిషోర్ మాట్లాడుతూ… లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే పథకాలను అందిస్తామని ఎర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం రామగుండం పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మావోయిస్టులు కూడా గ్రామాలకు తిరిగి రావాలన్నారు. ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడి జీవన స్రవంతిలో కలవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

CLICK HERE TO READ త్వరలో కరీంనగర్‌లో…

CLICK HERE TO READ MORE

Leave a Reply