మంథని ఆంధ్రప్రభ : మలేషియాలో ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు హైపోసిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో మంథనికి చెందిన జపాన్ షిటోరియు కరాటే అకాడమీ విద్యార్థిని మెట్టు హాసిని 66 కేజీలు కథ విభాగంలో బంగారు పతకం, కుమితే విభాగంలో వెండి పతాకం సాధించింది.
పతకాలు సాధించిన విద్యార్థిని ని జపాన్ సిటోరియు కరాటే జాతీయ ఉపాధ్యక్షులు పి.పాపయ్య, రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, ఇప్ప శ్రీనివాస్, ఇన్స్ట్రక్టర్స్ నాగెల్లి రాకేష్, జడగాల శివాని, కావేటి శివ గణేష్, కే శ్వేత నందన, ఎండి తైబా, టి.హర్షిని, కె.విష్ణు, బి విష్ణువర్ధన్, గేయ శ్రీరామ్, తేజ, శ్రీరాములు అభినందించారు.