మంథని మున్సిపల్ చైర్మన్ గా వొడ్నాల శ్రీనివాస్

మంథని మున్సిపల్ చైర్మన్ గా వొడ్నాల శ్రీనివాస్
మంథని, ఫిబ్రవరి 16, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ చైర్మన్ గా వొడ్నాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సోమవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికైన కౌన్సిలర్లతో మంథని ఆర్డీవో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ శ్రీనివాసును ప్రపోజర్లు మద్దికట్ల స్రవంతి, మారుపాక నిహారిక ప్రతిపాదించగా, వైస్ చైర్మన్ గా ముస్కుల సహేందర్ రెడ్డిని ప్రతిపాదకులుగా కుర్ర లింగయ్య, పెంటరి రాజు ప్రతిపాదించారు.
మున్సిపల్ పరిధిలో గెలిచిన 13మంది కౌన్సిలర్ల చేత ఆర్డీవో సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన 13మంది కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు.
