మంచిర్యాల‌దే మొదటి స్థానం…

మంచిర్యాల‌దే మొదటి స్థానం…

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఈ రోజు జరిగిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 ఇయర్స్(Under 14 years) బాలుర వాలీబాల్ సెలక్షన్స్ కం టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.

ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల జట్లు పాల్గొనగా మొదటి స్థానం మంచిర్యాల జిల్లా జట్టు, రెండవ స్థానంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు, మూడవ స్థానంలో నిర్మల్ జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయని దండేపల్లి మండల ఇంచార్జ్ విద్యాధికారి మంత్రి రాజు(Minister Raju) పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కందుల అశోక్, కొట్టే శ్రీనివాస్, టోర్నమెంట్ అబ్జర్వర్ ఫిసికల్ డైరెక్టర్ ఫణి రాజా, పిఈటి పీడీలు కార్తీక్,సత్యనారాయణ, మనోహర్, కోచ్ కార్తీక్, ఆర్ రవీందర్, వివిధ జిల్లా నుంచి వచ్చిన పీఈటీ, పీడీ పాఠశాల ఉపాధ్యాయలు, నిర్వహణ కార్యదర్శి టిడి గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply