Mancherial | ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కు సహకరించాలి

Mancherial | ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కు సహకరించాలి

  • ఎకరం స్థలం భవన నిర్మాణానికి ఎంపీ నిధుల సహకారం
  • ఎంపీ వంశీని కోరిన రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి

Mancherial | మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముదిరాజు కులస్తులకు కుల సంఘాల మీటింగ్ తో పాటు వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాల్ ఉండాలని కోరుతూ ఈ రోజు మంచిర్యాల పర్యటనలో ఉన్న ఎంపీ వంశీకి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దాదాపుగా నియోజకవర్గంలో 10 వేల కుటుంబాల‌ జనాభా కలిగిన ముదిరాజులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ ఉండాలని ఈ ప్రతిపాదన ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు, ఎకరం స్థలంతో పాటు భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించాలని కోరినట్లు తిరుపతి తెలిపారు. కూరగాయలు, పళ్ళ తోటలు, చేపలు పెంపకానికి ఈ సహాయాన్ని ఎంపీ అందించాలని కోరినట్లు చెప్పారు.

Leave a Reply