Mancherial | ముదిరాజు జాతి ప్రయోజనాలే ముఖ్యం

Mancherial | ముదిరాజు జాతి ప్రయోజనాలే ముఖ్యం

  • ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇచ్చాం
  • బీసీ డీ నుండి ఏలోకి మార్చాల్సిందే
  • సుప్రీంకోర్టు తలుపు తట్టకముందే సర్కార్ మేల్కోవాలి
  • రాష్ట్ర బీసీ కమిషన్ సానుకూల ప్రతిపాదన త్వరగా తేల్చాలి
  • బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మెమోరాండం అందజేత
  • విద్య, ఉపాధి, ఉద్యోగ రాజకీయ చైతన్యం కోసం ఆరాటం
  • తమ జాతిని రాజకీయంగా చావు దెబ్బతీస్తున్నారు
  • సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకోవాలి
  • తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్

Mancherial | మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : ముదిరాజుల‌ ప్రయోజనాలే ముఖ్యమని తమ కులస్తులు పండ్లతోటలు, చేపల పెంపకం నామమాత్ర జీవనోపాధిపై ఆధారపడడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇచ్చామని, బీసీ డీ నుండి ఏలోకి ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందేనని, సుప్రీంకోర్టు తలుపు తట్టకముందే సర్కార్ మేలుకొని తమ డిమాండ్ల పరిష్కారం దిశగా అడుగులేస్తే ఆందోళన, నిరసనలు చేయ‌మ‌ని, సానుకూల స్పందనను తాము కోరుతున్నామని, రాష్ట్ర బీసీ కమిషన్ సైతం సానుకూల ప్రతిపాదనతో త్వరగా తేల్చాలని కోరుకుంటూ, నాన్చివేతకు ఆస్కారం ఇవ్వకుండా నివేదిక తయారు చేయాలని సోమవారం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అసెంబ్లీ ప్రాంగణంలో మెమోరాండం అందజేశామన్నారు.

ముదిరాజులు విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ చైతన్యం కోసం ఆరాటపడుతున్నారని, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, ఎన్నికల్లో తమ జాతిని రాజకీయంగా చావు దెబ్బతీస్తున్నారన్నారు. సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రధాన డిమాండ్ గా ఇక ఉద్యమానికి శంఖారావం పూరిస్తున్నట్లు బండ ప్రకాష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనకు సహకరిస్తూ ఆరునెలల తదుపరి ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో ఆందోళనలతో డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి​ క్యాంప్ ఆఫీస్ కు పంపామని, ఆ తదుపరి బీసీ కమిషన్ కులగణన 42శాతం అమలుపై ఇంత సమయం వేచి చూశామన్నారు.

Mancherial

ఎలాంటి చర్యలు లేకపోగా, బీసీలకు తీరని అన్యాయంగా ప్రభుత్వ చర్యలు మారడంతో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు, దానికి ముదిరాజు జాతి సిద్ధం కావాలన్నారు. పోరాటాల ద్వారానే హక్కుల సాధన జరగనుందని, అందుకే మొదట బీసీ కమిషన్ కు పూర్తి వివరాలతో కూడిన పత్రాలను అందించి తమ జాతి ప్రయోజనాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ అనంతరం అసెంబ్లీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేసిన‌ట్లు చెప్పారు. ముందే సానుకూల స్పందన రాకపోతే ప్రత్యేక పోరాట కార్యాచరణతో తమ హక్కుల సాధనకు ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అన్నింటికన్నా జాతి ప్రయోజనాలే తమకు ముఖ్యమని బండ ప్రకాష్ స్పష్ట చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు రాష్ట్ర నాయకులు భల్లాల సత్తయ్య, పండుగ బాలు, దబ్బేట తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply