కౌడిపల్లి, మార్చి 5, ఆంధ్రప్రభ : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం శేరితాండ గ్రామ పంచాయతీలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే శేరితండ గ్రామ పంచాయతీలోని వస్త్రం తండాకు చెందిన హలవత్ శ్రీను (32) మంగళవారం రాత్రి ఇంట్లో గొడవపడి తాగిన మత్తులో తండాకు సమీపంలో ఉన్న కన్నారం గ్రామ చెరువులో పడి మృతి చెందాడు.
మృతుడు శ్రీనివాస్ కు భార్య అనిత, ముగ్గురు కుమార్తెలున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.