మంత్రాలయంలో వ్యక్తి ఆత్మహత్య

మంత్రాలయంలో వ్యక్తి ఆత్మహత్య

మంత్రాలయం, ఆంధ్రప్రభ : భార్య పిల్లలను వీడ‌లేక ఓ వ్య‌క్తి లోకాన్ని శాశ్వ‌తంగా విడిచి వెళ్లాడు. క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం మండ‌ల కేంద్రంలో ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న ఆదివారం వెలుగులోకి వ‌చ్చింది. ఎస్‌ఐ శివాంజిల్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మంత్రాలయంకు చెందిన బంగి రామాంజినేయులు (43) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంవత్సరం నుంచి భార్య పిల్లలకు దూరంగా ఉండడంతో మానసిక పరిస్థితి సరిగా లేదు.

ఈ క్ర‌మంలోనే మండ‌ల కేంద్రంలోని మాధవరం రోడ్లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా పొలంలో ఉన్న కొట్టంలో బంగి రామాంజినేయులు (43) ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ గొట్టం చుట్టూ దుర్వాసనతో ఉండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఎస్‌ఐ శివాంజిల్ ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించి పోస్టు మార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, ఉంది. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఉన్నారు.

Leave a Reply