Malasia Rare Verdict   :  15 ఏళ్లు జైలులోనే.. Andhra Prabha  SPL  Story

Malasia Rare Verdict   :  15 ఏళ్లు జైలులోనే.. Andhra Prabha  SPL  Story

నజీబ్​ రజాక్​..  ఇక జైలు  పక్షే

₹ 25,000 కోట్ల జరిమానా

(₹ 4,615 కోట్లు రికవరీ

సొంత ఇల్లు జైలూ.. నో

ప్రపంచంలోనే రేర్​ వెర్డిక్ట్​

మలేషియా మాజీ ప్రధానికి శిక్ష

1MDB  కుంభకోణ ఫలితం

ప్రపంచం దేశాల్లో.. అవినీతి కేసులపై  నజర్​

 ప్రపంచంలోనే తొలి టాప్​ లీడర్​ హిస్టరీ   

( ఆంధ్రప్రభ, అనాలిసిస్ ​ ప్రతినిధి )

 Malasia Rare Verdict   |  

  173 ఏళ్ల బ్రిటీష్​ వలస పాలనకు వ్యతిరేకంగా 12 ఏళ్ల పోరాటంతో… మలేషియాకు స్వాతంత్రం లభించినప్పటి నుంచి.. దాదాపు 57 ఏళ్ల పాటు మలేషియాను పాలించిన యునైటెడ్ మలేస్ నేషనల్ ఆర్గనైజేషన్ (UMNO)  అధినేత నజీబ్​ రజాక్​  82 ఏళ్ల ప్రాయంలో (Malasia Ex Prine Minister)  జైలు పక్షిగా మారిపోయాడు.

Malasia Rare Verdict

ఇప్పుడు ఆయన రాజకీయ ఖైదీ కాదు. అవినీతి కేసులో నెటోరియస్​ క్రిమినల్​ . మలేషియా ఆర్థికాభివృద్ధి లక్ష్యంతో.. 2009లో అప్పటి ప్రధాని నజీబ్ రజాక్  స్థాపించిన ప్రభుత్వ  వ్యూహాత్మక అభివృద్ధి సంస్థ. 1MDB కు చేరిన నిధుల్లో.. కైంకర్యం వెలుగులోకి వచ్చింది. 

Malasia Rare Verdict   |

   ఈ నిధి నుండి దాదాపు 4.5 బిలియన్ డాలర్ల (సుమారు ₹37,000 కోట్లు) మలేషియా ప్రభుత్వం దిగమింగేపింది.   షెల్ కంపెనీల పేరుతో  ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి  1MDB మళ్లించారు.  విలాసవంత  ఆస్తులు సేకరణ , ప్రైవేట్ జెట్లు, సూపర్ యాట్లు, వజ్ర వైఢూర్య నగలు కొనుగోలు,  హాలీవుడ్ సినిమా “ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్” నిర్మాణానికి వాడుకున్నట్టు  అమెరికా న్యాయ శాఖ విచారణలో తేలింది.

Malasia Rare Verdict

దాదాపు 1 బిలియన్ డాలర్ల (₹ 8,089 కోట్లు)  నిధులు నేరుగా నజీబ్ రజాక్ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయని విచారణలో తేలింది.  ఇప్పటికే 1MDB కేసులో నజీబ్ రజాక్ అవినీతి  నిర్ధారణ కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.తాజాగా  డిసెంబర్ 26, 2025న మలేషియా హైకోర్టు మరో కీలక కేసులో ఆయనను దోషిగా తేల్చింది.  అదనంగా 15 ఏళ్ల జైలు శిక్ష, 11.39 బిలియన్ రింగ్గిట్ల (సుమారు 2.8 బిలియన్ డాలర్లు ₹ 25,145 కోట్లు ) జరిమానా విధించింది.

Malasia Rare Verdict   |    

మనీ లాండరింగ్​ … ఇలా..

1MDB  నిధి నుండి తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి 700 మిలియన్ డాలర్లకు పైగా (£ 519 మిలియన్లు ₹ 6,286 కోట్లు ) మనీలాండరింగ్‌  కేసులో నాలుగు అధికార దుర్వినియోగ అభియోగాలు 21 మనీలాండరింగ్ ఆరోపణల్లో  నజీబ్‌ రజాక్​ ను మలేషియా  హైకోర్టు దోషిగా నిర్ధారించింది. అధికార దుర్వినియోగం ఆరోపణలకు ఒక్కొక్కరికి 15 ఏళ్ల జైలు ( 15 Years Jail)  శిక్షను జస్టిస్ కొలిన్ లారెన్స్ సెక్వెరా     విధించారు .

Malasia Rare Verdict

మనీలాండరింగ్ ఆరోపణలకు ఒక్కొక్కరికి 5 ఏళ్ల  జైలు శిక్ష విధించారు.ఈ శిక్షలు ఏకకాలంలో అమలు జరుగుతాయి.  ఇక నజీబ్​ మరో 15 ఏళ్లు  జైలు శిక్షను అనుభవించాల్సిందే, మునుపటి 1MDB కేసులో అతని ప్రస్తుత శిక్ష ముగిసిన తర్వాత కొత్త శిక్ష అమలులోకి వస్తుందని న్యాయమూర్తి చెప్పారు. అధికార దుర్వినియోగ ఆరోపణలపై ఆయనకు  11.4 బిలియన్ రింగిట్ (₹25,295 కోట్లు) జరిమానా (Penalty)విధించారు. అంతేకాకుండా, మనీలాండరింగ్ చట్టాల కింద నజీబ్ నుండి మరో 2.08 బిలియన్ రింగిట్ (₹ 4,615 కోట్లు)  ఆస్తులను (Assests Recovery)  రికవరీకి ఆదేశించారు. ఒక వేళ  నజీబ్ జరిమానా చెల్లించకపోతే,  మరిన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి. .

Malasia Rare Verdict   |  

కుప్పకూలిన నజీబ్​   

తీర్పు వెలువడే సమమంలో .. నీలి రంగు సూటులో (In Blue Suit)  నజీబ్​  లేచి నిలబడి ప్రశాంతంగా ఉన్నాడు, శిక్ష ఖరారు ప్రకటన వెలువడగానే  డాక్‌లోని తన కుర్చీలో  పడిపోయాడు. ప్రపంచంలోని  అతిపెద్ద ఆర్థిక కుంభకోణాలలో ఈ తీర్పు  ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది, ఇది ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టించింది.  యునైటెడ్ స్టేట్స్ ఇతర దేశాలలో అవినీతి కుంభకోణాలపై  దర్యాప్తునకు  స్ఫూర్తిని ఇచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్​ కు వెళ్తామని నజీబ్​ తరపు న్యాయవాది ప్రకటించారు.

 Malasia Rare Verdict   |    

తప్పు  చేయలేదని..

తాను ఏ తప్పు చేయలేదని నజీబ్​ రజాక్ (Nazeeb Rajaak) ​  ఖండించారు.  ఆ నిధులు సౌదీ అరేబియా నుండి వచ్చిన రాజకీయ విరాళమని లో టేక్ జో  నేతృత్వంలోని మోసపూరిత  ఫైనాన్షియర్లు తనను తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మిస్టర్ లో ఇంకా పరారీలో ఉన్నారు.  సౌదీ విరాళం  నజీబ్   వాదన “నమ్మలేనిది” అని న్యాయమూర్తి అన్నారు.

Malasia Rare Verdict

సౌదీ దాత నుంచి  వచ్చిన  నాలుగు లేఖలు నకిలీవని 1MDB నుండి నిధులు దారి మళ్లినట్టు ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయని జడ్జీ  అన్నారు. ఈ కుంభకోణంలో  నజీబ్ రజాక్​ కు  బాధితుడని, 1MDB మాజీ అధికారులు , మిస్టర్ లో   మోసగించారని  డిఫెన్స్ వాదనలను న్యాయమూర్తి  తిరస్కరించారు.  ఈ కుంభకోణంలో  కీలక పాత్ర పోషించిన  1MDBలో నజీబ్‌కు  మిస్టర్ లో   ప్రాక్సీ, మధ్యవర్తి పాత్ర పోషించారు, నజీబ్ , మిస్టర్​ లో మధ్య స్పష్టమైన బంధం  ఉందని   సాక్ష్యాధారాలు ఉన్నాయని  న్యాయమూర్తి స్పష్టం చేశారు.   

భారీ నిధుల మూలాన్ని ధృవీకరించి  మిస్టర్ లోపై చర్య తీసుకోవడంలో నజీబ్ విఫలమయ్యారని న్యాయమూర్తి గుర్తించారు.   అనుమానాస్పద మూలాలు ఉన్నప్పటికీ ఆ డబ్బును నజీబ్​  ఉపయోగించారని కేసును దర్యాప్తు చేస్తున్న అప్పటి అటార్నీ జనరల్,  అవినీతి నిరోధక చీఫ్‌ను తొలగించి  తన స్థానాన్ని కాపాడుకోవడానికి నజీబ్​  చర్యలు తీసుకున్నారని  జడ్జీ  అన్నారు.

“నిందితుడు ఈ దేశానికి చెందిన వ్యక్తి  కాదు,  నిందితుడిని తన చుట్టూ జరుగుతున్న దుష్ప్రవర్తనల (Mis Behaviour)  గురించి పూర్తిగా తెలియని అజ్ఞానిగా చిత్రీకరించడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఘోరంగా విఫలమవుతుంది.” అని న్యాయమూర్తి సెక్వెరా అన్నారు.

Malasia Rare Verdict   |    ​ రాజకీయ సమాధి

2009 నుంచి  2018 వరకు ప్రధాన మంత్రిగా పని చేసిన నజీబ్, 1MDB కుంభకోణం ఫలితంగా   2018లో  ప్రభుత్వం ఓటమికి దారితీసింది. ఈ  కుంభకోణంలో   మునుపటి కేసులో దోషిగా  జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  2020లో అధికార దుర్వినియోగం, నేరపూరిత నమ్మక ద్రోహం,  1MDB   మాజీ  SRC ఇంటర్నేషనల్ యూనిట్​  నుంచి నజీబ్​  ఖాతాల్లోకి 42 మిలియన్ రింగిట్ (£7.6 మిలియన్లు) మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు   12 ఏళ్ల  జైలు శిక్ష విధించారు.

Malasia Rare Verdict

  తుది అప్పీల్‌లో  ఓడిపోయారు.  ఆగస్టు 2022లో తన శిక్షను ప్రారంభించాడు,  జైలు శిక్ష అనుభవించిన తొలి  మలేషియా  మాజీ అగ్రనేతగా నజీబ్​ చరిత్రకు ఎక్కారు.    క్షమాభిక్ష కోసం ప్రయత్నిస్తే..   పార్డన్స్ బోర్డు (Pardon Board)  తిరస్కరించింది. కానీ  2024లో నజీబ్​  శిక్షను సగానికి తగ్గించింది,   జరిమానాలో  గణనీయ కోత విధించారు. 

Malasia Rare Verdict   |    

గృహ నిర్బంధమూ దక్కలేదు

గృహ నిర్బంధంలో  శిక్షను అనుభవించేందుకు నజీబ్​  ప్రయత్నం ఫలించలేదు. మలేషియా  మాజీ  రాజు జారీ చేసిన అరుదైన గృహ నిర్బంధం (Home Jail)  ఉత్తర్వు చెల్లదని గత వారం మలేషియా  హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఎందుకంటే అది రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా లేదు.  

Malasia Rare Verdict

పార్డన్స్ బోర్డు  క్షమాభిక్షతో  శిక్షను  తగ్గించగా..   ఆగస్టు 2028లో నజీబ్​  విడుదల కావాల్సి ఉండగా,   తాజా తీర్పుతో  జైలు శిక్ష కాలం పెరిగింది.  2022లో మరో అవినీతి కేసులో నజీబ్ భార్య రోజ్మా మాన్సోర్‌కు కూడా 10 ఏళ్ల  జైలు శిక్ష,  భారీ జరిమానాను న్యాయస్థానం  విధించింది. ప్రస్తుతం ఆమె  అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో..  ఆమె బెయిల్‌పై విడుదలైంది.

Leave a Reply