Makthal | నాణ్యమైన భోజనం అందించాలి…

Makthal | నాణ్యమైన భోజనం అందించాలి…

మక్తల్ మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించిన మైనార్టీ సంక్షేమ అధికారి


Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ బాలికల పాఠశాల / కళాశాలను శనివారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎం.ఏ.రషీద్ (M.A. Rashid) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను, స్టాక్ రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.

వంట గదిలోకి వెళ్లి వంటకు వినియోగించే నిత్యవసర సరకులైన బియ్యం, పప్పు, ఉప్పు, పసుపు, మిరప పొడి, పాలు, నూనె, గుడ్లను పరిశీలించి నాణ్యతను చూశారు. పాఠశాలలో విద్యార్థినులకు నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం (breakfast), భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాణి ఎలిజబెత్, ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు.

Leave a Reply