Makthal | భగవద్గీత కంఠస్థ పోటీలు

Makthal | భగవద్గీత కంఠస్థ పోటీలు

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : విశ్వహిందూ పరిషత్ బజరంగ్ ద‌ళ్ ఆధ్వర్యంలో భగవద్గీత (Bhagavad Gita) కంఠస్థ పోటీలను ఘనంగా నిర్వహించారు. మక్తల్ (Makthal) పట్టణంలోని సత్యసాయి దేవాలయంలో శ్రీకృష్ణుని, సత్యసాయి బాబా చిత్ర పటాలనికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆరవ అధ్యాయం ఆత్మసంయమయోగంలోని భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొలిమి రాములు, ముఖ్య వక్తగా రిటైర్డ్ జిహెచ్ఎం రాఘవేందర్ రావు (Raghavendra Rao) మాట్లాడుతూ… భగవద్గీత మానవ జీవితంలో జరుగుతున్న జరగబోయే అంశాలపైన ఆసక్తికరమైన అంశాలను చెప్పడం జరిగిందన్నారు. భగవద్గీత సమస్త మానవాళికి ఆచరణీయం, అనుసరణీయమైన గ్రంథమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం భగవద్గీత పారాయణం చేయడానికి సూచించారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) జిల్లా గౌరవ అధ్యక్షులు భీమ్ రెడ్డి, ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రావు, బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్, మూర్తి, శంకర్, నాగరాజ్, శ్రీను, శంకర్, పరశురాం, రమేష్, అశోక్, ఆనంద్, పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply