కారుకు ఓటు వేసి మోయిజ్ హుస్సేన్ ను గెలిపించండి

కారుకు ఓటు వేసి మోయిజ్ హుస్సేన్ ను గెలిపించండి

గడప గడపకు – జోరుగా కారు ప్రచారంలో చిట్టెం సుచరిత రెడ్డి
రైటప్: బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్న చిట్టెం సుచరిత రెడ్డి

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ 12వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎండి మోయిజ్ హుస్సేన్ ను ఆదరించి భారీ మెజారిటీ తో గెలిపించాలని రైతుబందు మాజీ జిల్లా అధ్యక్షులు చిట్టెం సుచరిత రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మోయిజ్ హుస్సేన్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి ఎండి మోయిజ్ హుస్సేన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం చేతకాదని ఆమె ధ్వజమెత్తారు. మాయమాటలతో రెండేళ్లు కాలం వెళ్ళబుచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఎలాంటి అభివృద్ధి చేయదని అన్నారు .కేవలం బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

కోట్ల రూపాయలు వెట్టించి గతంలో సీసీ రోడ్లు మురుగు కాల్వల నిర్మాణం చేయడం జరిగిందని గుర్తు చేశారు. తిరిగి మక్తల్ అభివృద్ధి సాధించాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. అబద్ధాలతో మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాచి వాత పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోయిజ్ హుస్సేన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అన్వర్ హుస్సేన్,12వ వార్డ్ ఇంచార్జ్ జమీల్ అహ్మద్, ఎండి సాదిక్, రాధిక, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply