Makthal | జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు శశిరేఖ

Makthal | జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు శశిరేఖ

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని జడ్పి ఉన్నత పాఠశాలకు చెందిన శశిరేఖ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 28 నుండి 30వరకు మైత్రి గ్రౌండ్స్ పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలో జరిగిన 44వ జూనియర్ రాష్ట్ర స్థాయి ఖో -ఖో పోటీల్లో నారాయణపేట జిల్లా కర్ని ఉన్నత పాఠశాల విద్యార్థిని శశిరేఖ ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లా జట్టు తరపున పాల్గొని అసమాన క్రీడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంద‌ని పాఠశాల జిహెచ్ఎం వెంకటయ్య, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి. రూప తెలిపారు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన శశిరేఖ ఈనెల1 నుండి 5 వరకు బెంగళూరు గుంజూరులో జరుగనున్న 44వ జాతీయ స్థాయి జూనియర్ ఖో-ఖో పోటీల్లో పాల్గొంటుందని పిడి బి.రూప తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ ఖోఖో కోచ్ బి.రూప మాట్లాడుతూ… పాఠశాలలో విద్యార్థులకు ప్రతినిత్యం ఖోఖో క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శశిరేఖ జాతీయస్థాయి ఖోఖో క్రీడల్లో పాల్గొనడం ఇది 4వ సారి అని తెలిపారు. జాతీయస్థాయి ఖోఖో క్రీడలకు ఎంపికైన శశిరేఖను ,అందుకు కృషిచేసిన బి.రూపను పాఠశాల జిహెచ్ఎం వెంకటయ్య, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ రాధ దత్తురామ్ అభినందించారు.

Leave a Reply