గెలిపించండి… సేవకురాలిగా పని చేస్తా

- అమ్మాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సునీత వీరారెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఆశీర్వాదం చేసి సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ, ప్రజల సేవకురాలిగా పనిచేస్తానని అమ్మాపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అమ్మాపురం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజలు మద్దతు ఇస్తే అమ్మాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే తన ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి పరిష్కరించడానికి అత్యంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రచార కార్యక్రమంలో అమ్మాపురం మాజీ సర్పంచ్ కడెం యాకయ్య, మాజీ ఎంపీటీసీ డోనుక ఉప్పలయ్య, సీనియర్ నాయకులు కడారి జయసింహ రెడ్డి, నరసింహారెడ్డి, తీగల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
