మెదక్ : సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్ చెరు నియోజకవర్గం (Patancheru Constituency) పట్టణం మహంకాళి ఆలయం నుండి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు సీసాల రాజు (Seesala Raju) ఆధ్వర్యంలో చేపట్టిన 21వ మహాపాదయాత్రలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ (Congress party) కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu Mudiraj) పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన సీసాల రాజు వారి మిత్రబృందాన్ని ఘనంగా సత్కరించి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేయాలని ఆకాంక్షించి కాసేపు వారి వెంట నడిచారు. ప్రతి ఏడాది దైవచింతనతో చేపట్టే పాదయాత్ర మంచి పరిణామమని నీలం మధు ముదిరాజ్ అన్నారు. దైవచింతనతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెంతకు 20సార్లు పాదయాత్ర పూర్తిచేసి నేడు 21వ సారి ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. స్వామివారి కృపాకటక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
