యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఈ రోజుడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు..కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం ఆయన స్థానికంగా ఉన్న దేవాలయాలను సందర్శిస్తారు.
కాగా.. . జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా ఈనెల 26వ తేదీతో ముగియనుంది. దీంతో భక్తులు భారీగా తరలి వెళుతున్నారు. మరోవైపు ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
మహా కుంభమేళాను పొడిగిస్తారా..?
ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. భక్త జన కోటి తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తర్వాత మహా కుంభమేళాను మరో రెండు రోజులు పొడిగించాలన్న డిమాండ్లు వినిపించాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కుంభమేళాను పొడిగించే ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని స్పష్టం చేసింది.