Mahabubnagar | మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ సంచలనం..

Mahabubnagar | మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ సంచలనం..
మేయర్ ఎన్నికల వేళ..
మహబూబ్నగర్లో రాజకీయ కలకలం
Mahabubnagar, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ నగరంలో మేయర్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న వేళ రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మేయర్ ఎన్నికల సమయంలో గ్రూపు రాజకీయాలు, శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యగా అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ ఎంపిక కీలక దశకు చేరుకున్న తరుణంలో ఈ అరెస్ట్ రాజకీయ చర్చలకు దారితీసింది. మాజీ చైర్మన్ అనుచరులు పోలీసుల చర్య పై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ప్రమాణ స్వీకరణ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
