MLA Nayak| మోసపోవద్దు..

MLA Nayak| మోసపోవద్దు..

MLA Nayak| నెల్లికుదురు, ఆంధ్రప్రభ – రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని మోసపోవద్దని మహబూబాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మురళి నాయక్ (Murali Nayak) అన్నారు. గురువారం మండలంలోని మునిగలవీడు, నెల్లికుదురు, (Nellikuduru) రామన్నగూడెం సొసైటీ లతో పాటు, మునిగిలవీడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు సౌకర్యాలు కల్పించటంలో కేంద్రాల నిర్వాహకులు అశ్రద్ధ వహించొద్దన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చందా నరేష్, ఏడిఏ శ్రీనివాస్, తోరూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బట్టు నాయక్, శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, సిరివెన్నెల మహిళా సామాఖ్య సంఘం అధ్యక్షురాలు కవిత, నాయకులు, నిర్వాహకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply