పూలే ఆశయాలతో ముందుకు సాగాలి

పూలే ఆశయాలతో ముందుకు సాగాలి
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బొడ్డు నాగరాజు గౌడ్
- తెలుగు బీసీ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మాదగోని నరేందర్ గౌడ్
మునుగోడు, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బొడ్డు నాగరాజు గౌడ్,తెలుగు బిసి ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మాదగోని నరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం,విద్యా విస్తరణకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముచ్చపోతుల నర్సింహ,జిట్టగోని పల్లయ్య,కాటం అంజయ్య,పెర్లుమాండ్ల శ్రీరామ్,మునుగాల సీతయ్య,గోలి ప్రవీణ్, తమ్మిశెట్టి ప్రసాద్,దేవల్ల మాలాద్రి,అయితగోని కృష్ణయ్య,తింగీకర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
