మూడేళ్లుగా కనిపించని యంత్రాలు
కుబీర్. ఆంధ్రప్రభ : అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా కుబీర్(Kubir) మండల కేంద్రంలోని స్వయం సహకార సంఘాల మహిళలకు అభివృద్ధి దిశగా వ్యవసాయ పనిముట్లు హార్వెస్టర్, ట్రాక్టర్(Harvester, Tractor) రోటవేటర్ ట్రాలీ పనిముట్లను అందజేశారు. ఆ యంత్రాలు కుబీర్ మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ రైతుల పొలాల్లో(in farmers’ fields) నడిపేందుకుగాను మహిళా సంఘాలకు అందజేసిన వైనం. కానీ ఇక్కడ ఆ యంత్రాలు ఏమాత్రం ఆచరణలో రాలేకపోయాయి.
అవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. బాబోయ్ అమ్మేశారా… మరి ఎక్కడైనా అద్దెకిచ్చారా,.. మహిళలకు తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉంటే గత మూడు సంవత్సరాల నుండి ఐకెపి కార్యాలయం ముందు యంత్రాలు(machines) కనబడకపోవడంతో మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పని చేసిన అధికారి ఏపిఎం(APM) తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తన పని తీరుపై మండల రైతులతోపాటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హార్వెస్టర్ ట్రాక్టర్ పనిముట్లతో ఐకెపి కార్యాలయంలో అగ్రిమెంట్(Agreement) చేసి మహిళా సంఘాల ముందు అద్దెకివ్వాలని ఉంటుంది. కానీ ఏపీఎం తనకు నచ్చినట్లుగా ఎవరిని పడితే వారిని కట్టబెట్టి యంత్రాలను మండలాన్ని దాటించి తన లాభాల కోసం ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా స్థాయి అధికారులు ఇప్పటివరకు యంత్రాలపై నిమ్మకు నీరు కార్చినట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుబీర్ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ట్రాక్టర్ హార్వెస్టర్‌తో పాటు పనిముట్లు కుబీర్ లోనే మహిళా సంఘాల భవనం వద్ద ఉంచాలని వారు డిమాండ్ చేశారు.