ప్రేమాభిమానాలు మరువలేనివి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ప్రజల ప్రేమ, అభిమానాలు మరువలేనివని, జిల్లా అభివృద్ధి(District development)కి తోడ్పాటు అందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలుతెలియజేస్తున్నానని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్(Collector TS Chetan) అన్నారు.
పుట్టపర్తి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్నజిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో తన పదవీకాలం(tenure)లో ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు, అధికారుల మద్దతుతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లగలిగానని పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులు, సిబ్బంది మాట్లాడుతూకలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో పని చేయడం తమకు అదృష్టమని(good luck), విధి నిర్వహణలో సహకారం, ప్రోత్సాహం అందించారని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ టీఎస్ చేతన్ తో కలిసి పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నానని, ఆయన మరికొంత కాలం జిల్లాలో కొనసాగి ఉంటే బాగుండేదని(it would have been good) అన్నారు. అభివృద్ధి పనులలో కలెక్టర్ అందించిన సహకారం మరువలేనిదని ఆమె అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు ఎంతో మేలు చేసిన కలెక్టర్ టీఎస్ చేతన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల వరకు పనిచేసి ఉంటే బాగుండేదని, అయితే ఉద్యోగుల బదిలీలు(transfers) సహజమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో సువర్ణ, వీవీఎస్ శర్మ, ఆనంద్ కుమార్, మహేష్, ఇన్‌ఛార్జి డీఆర్వో సూర్యనారాయణ రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మైనుద్దీన్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

