loudly | కాంగ్రెస్ అభ్యర్థి విస్తృత ప్రచారం

loudly | కాంగ్రెస్ అభ్యర్థి విస్తృత ప్రచారం

loudly | వాజేడు, ఆంధ్రప్రభ : పేరూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ (Congress) అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్లగా సి రమేష్ అరికిల్ల వేణు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొడ్డే వరలక్ష్మికి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఎస్సీ కాలనీ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు (VOTE) వేసి గెలిపిస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కురుసం కృష్ణమూర్తి, అరికల్లా రఘుపతి, తిప్పనపల్లి కళ్యాణ్ రాజ్, తోటపల్లి ఎల్లయ్య, అరికెళ్ల సమ్మయ్య, మల్లయ్య, తోటపల్లికిచ్చయ్య, లక్ష్మయ్య, అరికెళ్ల పెద్ద సమ్మయ్య, తోటపల్లి పూరయ్య, ,అరికిల్ల రామయ్య, తిప్పనపల్లి సుజన్, బండ రాములు, తిప్పనపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply