AP | బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు యువకులు మృతి

ప‌శ్చిమ‌గోదావ‌రి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని పశ్చిమగోదావరి (West Godavari) జిల్లాలో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జిల్లాలోని హనుమాన్ జంక్షన్ (Hanuman Junction) బైపాస్ రహదారిలో ఇవాళ‌ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు (Two young mens) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన వారీగా గుర్తించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply