Lorry-Bolero collision | ఘోర రోడ్డు ప్ర‌మాదం…

Lorry-Bolero collision | ఘోర రోడ్డు ప్ర‌మాదం…

ముగ్గురు మహిళలు మృతి
17మందికి గాయాలు
ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులు


Lorry-Bolero collision | శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల (Manchiryala) జిల్లా, ఇందారం క్రాస్ రోడ్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు మృతిచెందగా, 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా, చౌలి తాలూకా చాందిలి గ్రామానికి చెందిన వలస కూలీలు పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల్లో వరినాట్ల కోసం వెళుతుండగా వెనుక నుండి వచ్చిన లారీ (Lorry) బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక మహిళ స్పాట్లోనే మృతిచెందగా, ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మంచిర్యాల (Manchiryala) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 20మంది వలస కూలీలు ఉన్నట్లుగా బాధితులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply