local body elections | మరోసారి సర్పంచ్ బరిలో పోగుల దంపతులు….

local body elections | మరోసారి సర్పంచ్ బరిలో పోగుల దంపతులు….

local body elections | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోగుల భాగ్యశ్రీ సదానందం మంథని మండలం బిట్టుపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామంలో ప్రచారంలో వారు దూసుకు వెళ్తున్నారు. మరోసారి అవకాశం కల్పించాలని అందరికీ అందుబాటులో ఉంటానని భాగ్యశ్రీ సదానందం పేర్కొన్నారు.

గ్రామంలో ప్రతి ఓటు పోగుల దంపతులకు గెలుపు ఖాయమనే మాట వినిపిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. స్థానిక ప్రజలతో(local people) ఎల్లప్పుడూ మమేకమవుతూ ఉండడం వారికి కలిసొచ్చే అంశం.

గతంలో సర్పంచ్ గా చేసిన అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన, ప్రజల కోసం పోరాటం చేసే నాయకత్వం లక్షణాలు ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో(local body elections) వారికి గెలుపు ఖాయమని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటెయ్యాలని, మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వారు తెలిపారు.

Leave a Reply