పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కంపదండి అశోక్ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17గోజాతి,156 గేదేజాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు.
ఆనంతరం మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించుకోవాలని అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించారు. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల నోటిలో పుల్లతో చొంగ కారడం,కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవ లేకపోవడం,పాల ఉత్పత్తి తగ్గిపోవడం,పాడి పశువులకు అబార్షన్లు అవడం,వంటి లక్షణాలు ఏర్పడతాయన్నారు. కావున రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు మరియు పశు వైద్య సిబ్బంది ప్రవీణ్ రెడ్డి,స్పరన్ గోపాలమిత్ర తదితరులు పాల్గొన్నారు.
