Live | క్రిస్మస్ వేడుక‌ల్లో సీఎం రేవంత్.. ఎల్బీ స్టేడియం నుంచి లైవ్ !

Live | క్రిస్మస్ వేడుక‌ల్లో సీఎం రేవంత్.. ఎల్బీ స్టేడియం నుంచి లైవ్ !

ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జ‌రుగుతున్న‌ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Revanth Reddy | అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం..

ఇదిలా ఉండ‌గా.. ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేర‌కు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ వివ‌రాలు వెల్ల‌డించారు.

పబ్లిక్ గార్డెన్స్ ఏఆర్ పెట్రోల్ పంప్ నుండి బీజెఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తున్నారు. అలాగే బషీర్‌బాగ్‌ నుంచి వచ్చే వాహనాలను బీజెఆర్ విగ్రహం వద్ద గన్‌ఫౌండ్రి వైపు, సుజాత స్కూల్ వైపు నుండి వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించారు. ఆర్టీసీ బస్సులను కూడా ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి స్టేషన్ వైపు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

రద్దీ దృష్ట్యా లక్డీకాపూల్, రవీంద్ర భారతి, బషీర్‌బాగ్‌, లిబర్టీ ప్రాంతాల గుండా ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Leave a Reply