ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ ఎలాంటితో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే అభిమానులకు పండగే. ఆయనకు ఎంత గొప్ప పేరున్నప్పటికీ చాలా సాధారణమైన జీవనాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతారు. అయితే ఇటీవల సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకున్న రజినీకాంత్ తన ఫ్రెండ్స్, సన్నిహితులతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఈ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా రిషికేష్(rishikesh) వెళ్లారు. రిషికేష్ లోని స్వామి దయానంద్ ఆశ్రమాన్నిసందర్శించుకున్నారు. అక్కడ గంగా హారతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో రజనీకాంత్ రోడ్డు పక్కన ఆగి, ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా ఆకుల పళ్ళెంలో భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎటువంటి ఆడంబరం లేకుండా, కారు పక్కనే ఒక రాయిపై కూర్చుని ఆయన భోజనం చేయడం ఆయన సింప్లిసిటీనీ తెలియజేస్తోంది.