బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత‌…

బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత‌…

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీంగల్ మండల కేంద్రానికి చెందిన మద్నూర్ లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆమె వైద్య చికిత్స కోసం రూ. 1.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి) ను మంజూరు చేయించి, ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమకు ఆర్థిక సహాయం అందించి చికిత్సకు తోడ్పడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply