తిరుమల: తిరుమల (Tirumala)లో మరోసారి చిరుత సంచారం (Leopard roaming) భక్తులను, స్థానికులను కలవరపెడుతోంది. రాత్రి ఈస్ట్ బాలాజీ నగర్ సమీపంలోని బాలగంగమ్మ ఆలయం దగ్గర ఒక చిరుత (Leopard) సంచరించింది. అక్కడే ఉన్న ఒక పిల్లిపై దాడి చేయడానికి ప్రయత్నించింది.
ఈ దృశ్యాలు ఆలయం దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా (CCTV camera)ల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social media)లో బాగా వైరల్(viral) అవుతోంది. ఈ సంఘటన గురించి ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారుల (Forest officials)కు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు వెంటనే ఆలయ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
చిరుత సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు (Security measures) చేపట్టారు. అటవీ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. తిరుమలలో తరచుగా చిరుతలు కనిపించడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, అటవీశాఖ అధికారులు చిరుత((Leopard) లను పట్టుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిఘా పెంచాలని డిమాండ్ చేశారు.