Legacy | ఈసారైనా విశ్వక్ కి సక్సెస్ వచ్చేనా..?

Legacy | ఈసారైనా విశ్వక్ కి సక్సెస్ వచ్చేనా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Mass Ka Das Vishwak Sen). ఎక్కువ సినిమాలు చేయడం కంటే, నాణ్యమైన సినిమాలు చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ.. ఉత్తమ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే ఆయనకు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి పెట్టింది. మినిమమ్ క్వాలిటీ(Minimum quality) ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ హీరో అనే పేరు కూడా తెచ్చి పెట్టింది. అయితే.. ఈమధ్య సరైన సక్సెస్ రాలేదు. అందుకనే ఓ ప్రయోగం చేయబోతున్నారు. ఇంతకీ.. ఆ ప్రయోగం ఏంటి..? ఈసారైనా సక్సెస్ వచ్చేనా..?
Legacy | రాజకీయ నేపథ్యంతో లెగసీ..

విశ్వక్ లెగసీ అనే ఒక రాజకీయ నేపథ్యం(Political background)తో సాగే కథతో సినిమా చేస్తున్నారు. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతోంది. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులను తాను ఎంతగా ద్వేషిస్తాడో చెప్పే విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్(Voice over by Vishwak Sen) తో టీజర్ ప్రారంభమవుతుంది. రాజకీయ క్రీడలు, ఉన్నత స్థానాన్ని పొందడానికి వేసే ఎత్తుగడలు, అవకాశవాద రాబందుల మోసం తనకు నచ్చకపోయినా.. వారసత్వాన్ని(Inheritance) ఎవరో ఒకరి సమర్థ భుజాలపై మోయాల్సిన అవసరం ఉన్నందున, తాను ఆ బాధ్యతను చేపట్టాల్సి వచ్చిందని చెబుతాడు.
Legacy | మొరటు వ్యక్తిగా విశ్వక్ సేన్..

తన దివంగత తండ్రి స్మారక చిహ్నాన్ని(Memorial to the late father) సందర్శించడానికి వెళ్తున్నట్లు విశ్వక్ సేన్ పాత్రను పరిచయం చేశారు. అక్కడ అతను మృతదేహంపై మూత్ర విసర్జన చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం వైవిధ్యంగా ఉంది. ఆ తర్వాత రాజకీయ నాయకుల మధ్య అతను తుపాకీ పట్టుకొని కనిపించడం, తన గదిలో కాల్పులు జరగడం వంటి సీన్స్ ఉత్కంఠను పెంచాయి(Scenes like this added to the suspense). క్రూరంగా, దుఃఖంతో నలిగిపోయిన, మనసు విరిగిపోయిన, మొరటు వ్యక్తిగా విశ్వక్ సేన్ అద్భుతంగా మెప్పించారు. ఆయన లుక్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పొలిటికల్ డ్రామా పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. తనదైన నటనతో పాత్రలో పూర్తిగా లీనమైపోయిన తీరు ఈ చిత్రం పై అంచనాలను, ఉత్సుకతను పెంచుతోంది.
Legacy | అంచనాలు పెంచేసిన టీజర్..

పిండం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత, దర్శకుడు సాయి కిరణ్ దైదా ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామాకి ప్రాణం పోసేందుకు సిద్ధమయ్యారు. టీజర్ లోని విజువల్స్(Visuals in the teaser) బాగున్నాయి. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం, సీన్ కు తగ్గట్టుగా అద్భుతంగా ఉండి, టీజర్ ను మరోస్థాయికి తీసుకెళ్లింది. అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే లెగసీ సినిమా ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్(Film shooting) జరుపుకుంటుంది. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ తెలియచేయనుంది. అయితే.. విశ్వక్ పొలిటికల్ డ్రామతో సినిమా చేయడం అంటే ప్రయోగమే. మరి.. ఈ ప్రయోగం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
