Leader | ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

Leader | ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..
Leader | మక్తల్, ఆంధ్రప్రభ : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను నారాయణపేట జిల్లా(Narayanpet District) మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… తెలంగాణను ఇచ్చిన నాయకురాలు(Leader) సోనియమ్మను తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ తమ హృదయాలలో నిలుపుకుంటారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి మాట నిలబెట్టి రాష్ట్రాన్ని అందించిన ఆమె సేవ మరువలేనిదన్నారు.
ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్(Director) మేదరి శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు గోలపల్లి నారాయణ, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు బి.శంషుద్దీన్, నాయకులు వాకిటి హన్మంతు, పంచలింగాల నాగేష్, కల్లూరి గోవర్ధన్, హుస ముద్దీన్, రాజేందర్, ఓబులేష్, నరసింహ, రాము, అఫ్రోజ్, సురేష్, ప్రవీణ్, అంజప్ప, తదితరులు పాల్గొన్నారు.
