విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు

విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు

మునగాల తహసిల్దార్ కార్యాలయం త‌నిఖీ
విధుల‌కు గైర్హాజ‌రైన సిబ్బంది స‌స్పెన్ష‌న్‌

మున‌గాల‌, ఆంధ్ర‌ప్ర‌భ : మునగాల తహసిల్దార్ కార్యాలయాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సగానికి సగం సిబ్బంది విధులకు గైర్హాజరు కావ‌డంపై క‌లెక్ట‌ర్ సీరియ‌స్ అయ్యారు. గైర్హాజరైన డిప్యూటీ తహసిల్దార్, ఎంపీఎస్ఓ, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. సిబ్బంది గైర్హాజ‌రుపై త‌హ‌సీల్దార్‌ను కలెక్టర్ వివ‌ర‌ణ కోరారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బంది త‌ప్ప‌క సమయపాలన పాటించాల‌ని ఆదేశించారు.

Leave a Reply