నీటమునిగిన జగనన్న లేఅవుట్
- రేగుగుట్ట మండలంలో భారీ వర్షం
రేణిగుంట, ఆంధ్రప్రభ : రేగుగుట్ట మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అలుసుపాలెం(Let’s wear it)లోని జగనన్న లేఔట్ నీట మునిగింది. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పథకం మంజూరు చేసింది.కానీ కాలనీ నిర్మించి 3 సంవత్సరాలైనప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
రెండు రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(heavy rains)కు కాలనీ మొత్తం చెరువుని తలపిస్తోంది. కొన్ని ఇండ్లలోకి సైతం నీరు రావడంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సౌకర్యాలు(amenities) కల్పంచాలని ప్రజలు కోరుతున్నారు.