
Law University | గ్లోబల్ పూర్వ విద్యార్థి లా యూనివర్సిటీకి ఎంపిక
Law University | గ్లోబల్ పూర్వ విద్యార్థి లా యూనివర్సిటీకి ఎంపిక
Law University | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గ్లోబల్ మోడల్ పాఠశాల(Global model school)లో చదువుకున్న పూర్వ విద్యార్థి లట్ పటె శివప్రసాద్ ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌యు)కి ఎంపికై ఘనత సాధించారు. ఈ విషయం తెలుసుకున్న గ్లోబల్ మోడల్ పాఠశాలలో లా యూనివర్సిటీ(Law University)లో ఎంపికైన తమ పాఠశాల పూర్వ విద్యార్థి శివప్రసాద్ కు షాల్వతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అజీమోద్దీన్ మాట్లాడుతూ.. కఠినమైన పోటీ మధ్య ఈ విజయాన్ని సాధించడం నిజంగా అభినందనీయమని ఈ అపూర్వ విజయం గ్లోబల్ మోడల్ పాఠశాలకు మాత్రమే కాకుండా శివప్రసాద్‌ను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు అండగా నిలిచిన తల్లి దండ్రులకు గర్వకారణంగా నిలిచిందని పాఠశాల కరస్పాండెంట్(Correspondent) నజీమోద్దీన్ అన్నారు.
విద్యతో పాటు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగిన శివప్రసాద్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నారని, న్యాయ శాస్త్ర రంగంలో మరిన్ని శిఖరాలను అధిరోహించి, సమాజానికి సేవ చేసే ఉత్తమ న్యాయవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్ తండ్రి లట్పటే ఉద్ధవ్, గ్లోబల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
